News
జయలలితకు భారత రత్న ఇవ్వొదు
పీఎంకే యూత్‌వింగ్ నాయకుడు అన్బుమణి రాందాస్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి చేసినవారికే ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని, ఈ పురస్కారం పొందే అర్హత జయలలితకు లేదని ఆయన పేర్కొన్నారు. జయలలిత 15 అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారని, ఆమెను నిర్దోషిగా వదిలేసిన కేసుకు సంబంధించి అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాందాస్ ’’ద హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఏకవ్యక్తి పార్టీ కావడంతో జయలలిత మృతితో తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రానున్న నాలుగున్నరేళ్లు అధికారంలో నిలుపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు అండగా నిలుస్తున్నారని అన్నారు. జయలలిత ఏనాడు ఆమెను తన రాజకీయ వారసురాలిగా పరిగణించలేదని, ఒకవేళ పరిగణించి ఉంటే ఈపాటికే ఆమెకు పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. నిజానికి శశికళకు ప్రజామద్దతు లేదని చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








